హోంపేజి

తెలుగుదేశం పార్టీకి రెండు ప్రముఖ పత్రికలు కొమ్ము కాస్తున్నాయని తరచు విమర్శించే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన మనుషులతో ఒక భారీ దినపత్రికను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 50 కోట్ల పెట్టుబడితో 20 ఎడిషన్లతో ఈ పత్రిక ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన ఒక గ్రానైట్‌ వ్యాపారి ఈ కాంగ్రెస్‌ దినపత్రికకు ఎడిటర్‌గా, పబ్లిషర్‌గా ఉండబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న రెండు ప్రముఖ పత్రికలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే వార్తలు ప్రచురిస్తున్నందువల్ల ఆ దాడిని తిప్పికొట్టే ఉద్దేశంతోనే ఈ పత్రికను ప్రారంభించనున్నట్టు తెలిసింది. వార్త కాంగ్రెస్‌ ఎంపీ పత్రిక అయినప్పటికీ ఆ పత్రిక తెలుగుదేశం పార్టీని సరిగా ఎండగట్టలేకపోతోందని, వాస్తవానికి కాంగ్రెస్‌ డైలీ అంటూ ఒక్కటి కూడా లేదని, ఆ లోటును తీర్చడానికి ఈ దినపత్రికకు ప్రాణం పోయాలని వైఎస్‌ పట్టుదలగా ఉన్నారు. దినపత్రిక కోసం 50 కోట్లు సమీకరించడం అధికార పార్టీకి కష్టం కాదు. ప్రభుత్వ, ప్రైవేటు అడ్వర్టయిజ్‌మెంట్లు పుష్కలంగా వస్తాయి. ఈ పత్రిక వచ్చే ఏడాది మధ్యలో వెలుగుచూసే అవకాశముంది. ఈ పత్రిక బాధ్యతను నెత్తికి ఎత్తుకోనున్న వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్‌పోర్టల్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఎన్నారైల మద్దతును కూడగట్టగలిగారు. కొత్త పత్రికకు ఆటా ప్రముఖులు కూడా ఫైనాన్స్‌ చేసే అవకాశముంది.

అమెరికాలో గ్రాండ్‌ దీపావళి మేళా
అభినయశ్రీకి నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+