చంద్రబాబుకు "సొంత" పత్రిక పాఠాలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి నాలుగేళ్ళ క్రితం పునరుద్ధరణకు నోచుకున్న ఒక ప్రముఖ దినపత్రికకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. ఆ పత్రిక పూర్వాపరాలు, దాని విధానం బాగా తెలిసిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేక సార్లు ఆ పత్రిక మీద విరుచుకుపడ్డారు. రాజశేఖరరెడ్డి స్వయంగా ఒక దినపత్రిక పెట్టుకోడానికి స్పూర్తిని ఇచ్చింది ఈ పత్రికే.
తనది అనుకునే పత్రిక తనకు నీతి పాఠాలు, రాజనీతి సూత్రాలు చెబుతూ నేడు ప్రచురించిన వార్తా కథనం చంద్రబాబు నాయుడికి చికాకు కలిగించి ఉండాలి. తెలుగుదేశం పార్టీ భావదారిద్ర్యంతో బాధపడుతోందని ఈ పత్రిక రాసింది. ప్రతీపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారని మొసలి కన్నీళ్ళు కార్చింది.
కాంగ్రెస్ పై పోరాటం చేయడానికి ఇంకా పంథా ఖరారు ఖాలేదని ఆక్షేపించిన ఆ పత్రిక రాసిన కథనం వ్యూహ రచనకు తమను సంప్రదించవచ్చన్న సంకేతాలు పంపింది. చంద్రబాబుకు ఎన్ని వైఫల్యాలు ఉన్నాయో వైఎస్ కూ అంతేనని చెప్పి ఈ పత్రిక న్యాయమూర్తి పాత్రను చక్కగా నిర్వర్తించింది. తన ఆశీస్సులతో తన హయాంలో వచ్చిన ఒక పత్రిక తనకే పాఠాలు చెప్పడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు తనదైన శైలిలో కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు.












Click it and Unblock the Notifications