అయితే కాపు, లేకపోతే మున్నూరు కాపు
పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కేశవరావు (మున్నూరు కాపు) స్ధానంలో కోస్తా ఆంధ్రకు చెందిన అగ్రకుల కాపు నాయకుడిని నియమించాలన్న డిమాండ్ ఊపు అందుకుంటోంది. మున్నూరు కాపులు బిసిలు కాగా కోస్తా కాపులు ఓసిలు. తెలంగాణ నుంచి ఈ పదవికి తీవ్రంగా పోటీ పడుతున్న వి.హనుమంతరావు కూడా మున్నూరు కాపే.
ఒకవేళ కోస్తా కాపులకు ప్రాధాన్యత ఇచ్చే పక్షంలో గుంటూరు జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. కాపు కులానికే చెందిన చిరంజీవి రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైన నేపధ్యంలో పిసిసి అధ్యక్ష పీఠం ఈ సామాజిక వర్గానికే కేటాయించడం సమంజసమన్న వాదన విన్పిస్తోంది.
తమ కులానికి అన్యాయం జరుగుతోందని ఎంపీ హరిరామజోగయ్య, కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు నిరసన వ్యక్తం చేసిన నేపధ్యంలో కోస్తా కాపు ఓటు బ్యాంకును కాపాడుకోడానికి కాంగ్రెస్ అధిష్టానవర్గం తీవ్రంగా కసరత్తు చేయవలసిన అవసరం ఏర్పడింది.












Click it and Unblock the Notifications