ఈ సినిమాలు టిక్కెట్టు కొని చూడాలా

ఎక్కడుందీ లోపం అని అంతర్గంతంగా పరిశీలిస్తే కారణం ఒకటే కనపడుతుంది. అది ఫిలిం మేకింగ్ పై సీరియస్ నెస్. నిజానికి రెండూ చిన్న సినిమాలే . రెండూ కాంటపరరీ అంశాలే. గోకుల్ ఛాట్ బాంబు ప్రేళుల్లను ఆధారం చేసుకుని అల్లిన కథతో ఆదివిష్ణు అని సినిమా నిర్మిస్తే,2006 జూలై 11 న జరిగిన ముంబయి మెట్రో రైళ్శ బాంబు ప్రేలుళ్ళపై ఈ సినిమా వచ్చింది.
ఆదివిష్ణులో ఓ సాప్ట్ వేర్ కుర్రాడు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉండగా అనుకోని పరిస్ధితుల్లో బాంబు ప్రేలుళ్ళ అనుమానితుడుగా అరస్టవుతాడు. తర్వాత బాంబు ని పెట్టిన వారు దొరికిపోతే బయిటకు వచ్చి తనను ఇరికించిన వారిపై రివేంజ్ తీర్చుకుంటాడు. అంతేగానీ ఎక్కుడా ఇక్కడ సామాన్యుడు ఎదుర్కోన్న సమస్యను మనముందుంచి పరిష్కారం కోసం పాటపడడు. అదే ముంబయి మేరే జాన్ దగ్గరకి వచ్చే సరకి వాస్తవానికి ప్రాధాన్యత ఇచ్చి బాంబు ప్రేలుళ్లు సామాన్య జన జీవితంపై ఏ రకమైన ప్రభావం చూపెట్టాయి. ఎంత స్ట్రగుల్ పడ్డారనే విషయాన్ని ఐదు ప్రధాన పాత్రల ప్రయాణంలో వివరించటానికి ప్రయత్నం చేస్తుంది . ఇక ఆదివిష్ణులో ఎంతసేపు దశావతారం వంటి హిట్ సినిమా పేరడీతో ప్రజలను ఆకట్టుకుందామా లేక స్నేహ అందాలని క్యాష్ చేసుకుందామా అనే తాపత్రయం కనపడుతుంది. టార్చ్ లైట్ వెతికి చూసినా ఎక్కడా నిజాయితీ,చిత్త శుద్ది అనేవి కనపడవు.
సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. జన జీవితంలో మార్పుకు దోహదం చేయాలి. మనం ఎదుర్కోవటానికి భయపడే వాస్తవాన్ని మన కళ్ళ ముందుంచి ఆలోచింప చెయ్యాలనే మొదటి తరం సినీ పెద్దల మాటలను ఎప్పుడో మన తెలుగు సినిమా మర్చిపోయింది. పోనీ నిజాయితీగా అన్నా ఉన్న వాస్తవాన్ని ఆసక్తిగా మన ముందుంచుతుందా అంటే అదీ లేదు. వాస్తవ పరిస్దితిని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నప్పుడు ప్రధాన పాత్రలు కూడా అదే పరిధిలో ఉంటే ఫలితం అధ్భుతమంటూ చెప్తుంది. ఇదంతా సినిమా తీయాలన్న కుతూహలం,ఆసక్తి కన్నా సమాజాన్ని ప్రతిబింబించే చిత్రం తీయాలన్న కోరిక తో వచ్చేది. అలాంటి స్ధితి వచ్చే వరకూ ఆదివిష్ణు వంటి చిత్రాల తో సరిపెట్టుకోవాలా...అన్నది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న.ఇలాటి స్ధితిలోనే ప్రేక్షకుడు టిక్కెట్ పెట్టి ఈ సినిమాను చూడాల్సిన అవసరముందా అని సందేహం వస్తుంది.












Click it and Unblock the Notifications