ప.గో. జిల్లాలో మెగా పాగా

వెలమ దొర అయిన కోటగిరికి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య సత్ సంబంధాలు లేవని తెలుస్తోంది. చిరంజీవి తెలుగుదేశం పార్టీలో కలిస్తే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని నిన్న విద్యాధర రావు వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమైన ముందడుగు అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హరిరామ జోగయ్య కూడా చిరంజీవి పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి పార్టీ ప్రారంభం కాకముందే పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెగా పాగా వేసీనట్టయింది.












Click it and Unblock the Notifications