కండల హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ కథ మరోసారి విషాదాంతం కానుందా. పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రేమ విషాదాంతంగా ముగిసింది. తాజాగా అతన్ని కత్రీనా కైఫ్ కూడా వదిలేసేటట్లు ఉందనే ప్రచారం బాలీవుడ్ లో ఊపందకుంది. ఇటీవలి కాలంలో కత్రీనా సల్మాన్ ఖాన్ లేకుండా హాజరైన పార్టీలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె సావరియా సినిమా హీరో రణబీర్ కపూర్ తో లేట్ నైట్ పార్టీలో కనిపించి చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వీరిద్దరు ఇటీవల ఒకటి రెండు సార్లు కలిశారట. కత్రీనా చివరికి వచ్చేసరికి సల్మాన్ ఖాన్ ను వదులుకుంటుందా, లేదంటే రణబీర్ కు గుడ్ బై చెబుతుందా అనేది ప్రశ్న. ఆడవారి గుండె లోతులు ఎవరికి తెలుసు.