కాంగ్రెస్ వైపు చిరు స్టెప్స్?

ఇలా ఉండగా నిన్న ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి "వైఎస్ పారదర్శకంగా ఉంటారు. చిరంజీవి ఒక పట్టాన అర్ధం కాడు" అని వ్యాఖ్యానించారు. దీని భావమేమి తిరుమలేశా అని అనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. వైఎస్ భోళా మనిషని, చంద్రబాబు మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి చెప్పే వ్యక్తి అని చిరు చెప్పకనే చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని, కాంగ్రెస్ ను కలపడానికి టీఅర్ ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా వైఎస్ కు బాబు కంటే ఎక్కువ మార్కులు ఇచ్చిన చిరంజీవి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ కూటమి ఏర్పడే అవకాశాలు స్పష్టమైతే ప్రజారాజ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం దాదాపు ఖాయమని భావించవచ్చు.












Click it and Unblock the Notifications