వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై 'కసినేని'

By Staff
|
Google Oneindia TeluguNews

కేసినేని నానిని ప్రజారాజ్యంలో చేర్చుకోవడం ద్వారా అనేక కొత్త సమస్యలను చిరంజీవి కొని తెచ్చుకున్నారు. తన మెగా నిర్మాత ప్రజారాజ్యంలో కాకుండా తెలుగుదేశంలో కొనసాగడంతో, ఆ కసి మీద అదే సామాజిక వర్గానికి చెందిన కేసినేని నానిని పార్టీలో చేర్చుకున్నందుకు, ఆ తర్వాత నానితో నానా బూతులు తిట్టించుకున్నందుకు చిరంజీవి ఇప్పుడు తల పట్టుకుని కూర్చోవాల్సిన పరిస్ధితి వచ్చింది. నాని నేడో రేపో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నాని ఉదంతంతో కృష్ణా జిల్లాలో కమ్మ- కాపు రాజకీయాలు మళ్ళీ భగ్గుమన్నాయి.

నాని చేసిన పూర్తి వ్యాఖ్యలను ఇక్కడ చదవండి:

వచ్చే ఎన్నికల్లో టికెట్‌లను అమ్ముకోవడం ద్వారా రూ. 2500 కోట్లను సంపాదించడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పథకం వేశారని కృష్ణా జిల్లా(అర్బన్‌)కన్వీనర్‌ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పూర్తయిన తరువాత బీజేపీకి ఎంపి సీట్లు అమ్ముకోవడం ద్వారా మరిన్ని డబ్బులు సంపాదించడానికి పథకం వేశారని ఆయన ఆరో పించారు. చిన్న కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఇంట్లోకి రానివ్వని మీరు అమలు చేసే సామాజిక న్యాయమమిదేనా అని ప్రశ్నించారు. చిరంజీవి సినిమాల్లో నటించడం కన్నా జీవితంలోనే ఎక్కువ నటిస్తాడన్నారు.

మీ ఇంట్లో వాళ్లు ఎవరైనా ఇప్పటివరకూ రక్తదానం చేశారా..లేదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. భీష్మ రాజ్యాన్ని అల్లు అరవింద్‌, అభిమా నుల రాజ్యాన్ని నాగబాబు చూస్తారని వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న పరకాల ప్రభాకర్‌, మిత్రాల ను కూడా అవమానపరుస్తూ, వారితో పాటు కేసీఆర్‌ మూర్తిని కూడా పార్టీ నుంచి బయటకు పంపడానికి పథకం వేశారని వెల్లడించారు. సోమ వారం ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కన్వీనర్‌ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లా డుతూ..మీరు పార్టీ టికెట్లను అమ్ముకోవడం వాస్త వం కాదా..అని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత మీరు సీఎం అయితే సరే.. లేదంటే మీరు టికెట్‌లు అమ్ముకున్న డబ్బుల ద్వారా లాభపడాలని చూస్తున్నారని ఆరోపించారు.

రెండు రకాలుగా లాభపడాలనేదే మీ వ్యూహమని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం అమలు చేస్తా మంటున్నారు..మరి వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో కూతురును ఇంట్లోకి రానివ్వకపోవడమేనా..మీరు అమలు చేయదల్చుకున్న సామాజిక న్యాయమని ప్రశ్నించారు. మహిళా పక్షపాతినని చెప్పుకునే మీరు మీ తమ్ము డు పవన్‌ కళ్యాణ్‌ అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య ఉండి కూడా సహజీవనం పేరుతో వేరొక మహిళతో కలసి ఉంటే మీరు మందలించకపోవడమేనా మహిళా పక్షపాతి అంటే అర్థమని ఎద్దేవా చేశారు. ఇంత వరకూ మీఇంట్లో ఎవరైనా రక్తదానం చేశారా..అంతెందుకు నేత్రదానం పేరుతో మీరు ప్రకటనలు ఇస్తున్నారు..మరి మీ తండ్రి చనిపోయినప్పుడు ఆయన కళ్లు ఎందుకు దానం చేయలేదని ప్రశ్నించారు. తను పార్టీలో ఉన్న మూడు నెలల కాలంలోనే ఇది అర్థమయ్యిందన్నారు. నానీతో పాటు నందేడ్‌ ప్రభాకర్‌, కొల్లి నాగేశ్వరరావు, కిలారిఫణి ప్రసాద్‌తో పాటు పలువురు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X