సత్యం రాజుకు ప్రాణభయం?

రామలింగరాజును నిన్న హై సెక్యూరిటీ మధ్య చంచల్ గుడా నుంచి మెహిదీపట్నంలోని సీఐడి కార్యాలయానికి తరలించారు. మీడీయా కంట ఆయన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రామలింగరాజు నోరు మెదిపితే అనేక పెద్దల పేర్లు బయటపడవచ్చు. అయితే సీఐడి రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది కాబట్టి పెద్ద పేర్లు ఆయన నోటి నుంచి వచ్చినా అవి బయటకు వచ్చే అవకాశం లేదు. అందుకే ప్రధాని మన్మోహన్ సింగ్ సత్యం కేసు విచారణ కుంటి నడకగా సాగడం పట్ల అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సెబీ విచారణకు ముందే అనుమతి ఇచ్చి ఉంటే ఎందరో పెద్దలు ఇరుక్కుని ఉండే వారని ఆర్ధిక నిపుణుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications