చల్లబడిన జగన్ వర్గం

జగన్ ఈ క్యాంప్ ఆఫీసుకు రాగానే బిలబిల మంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మొదటి గంటలో అక్కడికి ఎమ్మెల్యే సినీనటి జయసుధ, వట్టి వసంతకుమార్ మినహా ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కొందరు కలిశారు కానీ వారు భయం భయంగానే అధిష్టానానికి తెలిస్తే ఏమవుతుందో అన్నట్టు వ్యవరించారు. వైఎస్ వట్టి వసంతకుమార్ ను ఎన్నో కుంభకోణాల నుంచి రక్షించారు. జయసుధకు ఆ క్రిష్టియన్ మతానుబంధం, విశ్వాసం ఉంది. జగన్ హైదరాబాద్ రాగానే ఆకాశం బద్దలవుతుందని ఊహించిన ఆయన శిబిరం మేధావుల్లో భయం గూడు కట్టుకున్నట్టు కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications