చిరంజీవి ఆఫీసు వెల వెల

ఐదేళ్ళ పాటు వేచి చూడాలంటే చిరంజీవికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక పవన్ కల్యాణ్ అసహనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా కొన్ని పనులైనా చేసుకోవాలని చిరు ప్రయత్నం. కానీ రాజశేఖరరెడ్డి వ్యూహం వేరే విధంగా ఉంది. ఇందులో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందే ఆ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ముడుపులు అందినట్టు సమాచారం. పార్టీ చిహ్నం మార్చుకోడానికి చిరు ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీ మారడానికి ఆయన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండడం క్లైమాక్స్ కు ముందు సన్నివేశమా? అదే క్లైమాక్సా? చూడాలి మరి.












Click it and Unblock the Notifications