పురంధరేశ్వరికి రాజమండ్రి?

పునర్విభజన తర్వాత అనేక కమ్మ గ్రామాలు రాజమండ్రి లోక్ సభ స్ధానం పరిధిలోకి వచ్చాయి. అందువల్ల పురంధరేశ్వరికి అదే సురక్షితమైన స్ధానమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజమండ్రి స్ధానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్ల్ పోటీ చేయడానికి భయపడుతున్నారు. రామోజీరావు భయం ఒకటి కాగా, అక్కడ బ్రాహ్మణ ఓట్లు స్వల్పంగా ఉండడం, తన కుడి భుజమైన జక్కంపూడి రామ్మోహనరావు అస్వస్ధుడు కావడంతో ఉండవల్లి పోటీకి జంకుతున్నారు. అనువాదకుడిగా సోనియాగాంధీకి సన్నిహితుడైన ఆయనను ఈసారి రాజ్యసభకు పంపించాలనుకుంటున్నారు. ఇక రాజమండ్రిలో పూరంధరేశ్వరిపై పోటీకి తెలుగుదేశం పార్టీ కమ్మ కులానికే చెందిన మాజీ ఎంపీ మూర్తిని నిలబెట్టాలనుకుంటోంది. ఆ పోటీ ఆసక్తికరమే మరి.












Click it and Unblock the Notifications