మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాస మారకున్నా గెలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
మెదక్ నుంచి లోక్ సభకు తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ మీద విజయం సాధించిన విజయశాంతి నిన్న లోక్ సభలో తెలుగులో కాకుండా ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేయడంపై అనేక కథనాలు విన్పిస్తున్నాయి. ఆమె తన ఆంధ్రా యాసను కవర్ చేసుకోడానికే ఆంగ్లంలో ప్రమాణం చేసినట్టు విమర్శలు వచ్చాయి. కానీ పది లక్షలకు పైగా జనాభా ఉన్న మెదక్ నియోజకవర్గంలో వందకు పైగా బహిరంగసభల్లో విజయశాంతి ప్రసంగించారు. అప్పుడు భాష విషయంలో తీసుకోని జాగ్రత్తను ఇప్పుడు ఆమె ఎందుకు తీసుకున్నట్టు? ఇది నిజమేనా?

తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకునే విజయశాంతి మద్రాసులోనే, కోస్తా ఆంధ్ర సంస్కృతిలో పెరిగింది. ఆమె భాష, యాస పక్కాగా కోస్తాలో ఒక సామాజిక వర్గానికి చెందినదే. విజయశాంతి తాతలు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారని కొందరు తెలంగాణ వాదులు చాలా ఏళ్ల క్రితమే వంశవృక్షాన్ని బయటికి తీశారు. మెదక్ జిల్లాలో పక్కా కోస్తా బాషలో ప్రచారం చేసుకుని గెలిచిన విజయశాంతి మీద ఈ ఢిల్లీ విలేకరులు చేస్తున్న విశ్లేషణలు సత్యదూరంగా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X