వైయస్ దూకుడుకు హైకమాండ్ కళ్ళెం, రోశయ్య హ్యాపీ

YS Jagan
జగన్ దాదాపు దిగివచ్చినట్టే తాత్కాలికంగానైనా. ఆయనపై రోశయ్య నైతిక విజయం సాధించినట్టే కన్పిస్తోంది. రోశయ్యలో ఇప్పుడు అపార ఆత్మ విశ్వాసం కన్పిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు ఆయన అదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. జగన్, ఆయనను సమర్ధిస్తున్న వారి ఆర్ధిక వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్నామని, అవరమైతే ఐటీ, సిబిఐ లను ప్రయోగిస్తామని హైకమాండ్ సంకేతాలను పంపడం వల్లనే జగన్ తగ్గినట్టు ఢిల్లీలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం ద్వారా జగన్ అధిష్ఠానం కట్టును దాటారని అంటున్నారు. తన తండ్రి వైయస్ వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్న ఆయన ఏ ఒక్క సందర్భంలోనూ సోనియాకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మొదటి నుంచి హైకమాండ్ కు ఆగ్రహం తెప్పిస్తున్న అంశాల్లో ఇదొకటి. జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ఆర్ధిక వ్యవహారాల మీద కన్నేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏడేళ్ళ క్రితం అప్పులు చేసుకుని బతికిన జగన్ కు ఇప్పుడు ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నలు ప్రధానంగా తలెత్తుతున్నాయి.

రాజకీయ అవసరాల కోసం సీబీఐ, ఐటీ శాఖలను దాడులకు వినియోగించడం అధికారంలో ఉన్న పార్టీలకు పరిపాటని..గతంలో మాయావతి, లాలుల విషయంలోనూ ఇలాంటి చర్యలే తీసుకుని వారిని అదుపు చేసిన విషయాన్ని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+