వైయస్ జగన్ వైఫల్యం, నాయకత్వ నాశనం

YS Jagan
తూర్పు గోదావరి జిల్లాలో సుదీర్ఘ యాత్ర ముగించుకున్నా జగన్ అటు అధిష్టానంపై, ఇటు రాష్ట్ర కాంగ్రెసు పై పెద్ద ప్రభావం చూపలేకపోయారు.తనకు ప్రధాన మద్దతుదారయిన ఎమ్మెల్యే కొండా సురేఖకు అధిష్ఠానం షోకాజ్‌ నోటీసు జారీ చేసి ఇరవై 4 గంటలు దాటుతున్నా ఇంతవరకూ దానిపై జగన్‌ నోరు విప్పకపోవడంపై సొంత శిబిరంలోనే విమ ర్శలు వినిపిస్తున్నాయి.

జగన్‌ను సమర్థించే పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, కిసాన్‌సెల్‌ కార్యాలయ కార్యదర్శి గట్టు రామచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి ఇన్ని రోజులవుతున్నా, వాటిని ఎత్తివేయించేందుకు జగన్‌ ఇంతవరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, ఢిల్లీలో ఉన్నప్పటికీ, ఆ మేరకు అధిష్ఠానంతోచర్చలు జరపకపోవడం జగన్‌ శిబిరంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొండా సురేఖ, అంబటికి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేసేందుకు ఎవరితో నయినా మాట్లాడతానని కాకినాడలో చెప్పి 8 రోజులవుతున్నప్పటికీ, ఆ మేరకు జగన్‌ కనీస ప్రాథమిక ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన సమర్థతపై చర్చ మొదలయింది.

కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో వైయస్‌ వర్గీయులు కొందరు దానిని వ్యతిరేకించగా, వ్యతిరేకవర్గం మాత్రం స్వాగతించింది. అయితే, జగన్‌ మాత్రం ఇంతవరకూ షోకాజ్‌పై నోరు మెదపక పోవడం ఆయన సొంత శిబిరంలోనే విస్మయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+