8 నుంచి జగన్ ఎమ్మెల్యేల సమీకరణ కార్యక్రమం

సొంతపార్టీ తప్పదన్న అభిప్రాయానికి జగన్ వర్గం మేధావులు వచ్చినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా నిలిచిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పైనా వేటు పడనుందని, మంత్రివర్గ విస్తరణలో ఆయనను తొలగించవచ్చని, జగన్‌తో పాటు మొదటి నుంచి మద్దతుదారులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపైనా అధిష్ఠానం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు జగన్ శిబిరానికి అందినట్లు సమాచారం. అదే సమయం లో తన మద్దతుదారులు, కుటుంబసభ్యులపై రోశయ్య ప్రభుత్వం నిఘా పెట్టి, వారిని ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న వైనంకూడా జగన్‌ను మరింత రెచ్చగొట్టేలా చేస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications