నందమూరి కుటుంబానికి ఇంకా హీరో జూనియర్ ఎన్టీఆర్ అవుట్ సైడరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ను మనస్ఫూర్తిగా తమలోకి తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. అలా ప్రచారం జరగడానికి కారణాలు లేకపోలేదు. నిప్పు లేకుండా పొగ రాదు కదా. ఇటీవల జరిగిన కళ్యాణ్ రామ్ కత్తి ఆడియో ప్లాటినం డిస్క్ కార్యక్రమానికి నందమూరి వంశస్థులంతా హాజరయ్యారు. బాలకృష్ణ, హరికృష్ణ, తారకరత్నలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. కళ్యాణ్ రామ్ సినిమాను ప్రమోట్ చేయడానికి నందమూరి కుటుంబమంతా పని కట్టుకుని ముందుకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమా విషయంలో అలా జరగలేదు. ఆ మధ్య జరిగిన బృందావనం ఆడియో విడుదల కార్యక్రమానికి నందమూరి హీరోలెవరూ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దానికి హాజరయ్యాడు. లోలోన ఎలా ఉందో చెప్పలేం గానీ బయటకు మాత్రం ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబ సభ్యులు పూర్తిగా తమలోకి ఆహ్వానించడం లేదనే పొగ మాత్రం అలుముకుంటోంది.