జగన్ ను వదిలి రోశయ్యను పట్టేసిన కెవిపి

ఆయనకు రాష్ట్రంలో ఒక పదవి ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో ఉన్నారు. సచివాలయంలో ఇప్పటికీ ఆయన హవా కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. పెద్ద పైరవీలు చేయడంలో ఆయనకు ఎవరూ సాటిరారని మంత్రులే అంటూ ఉంటారు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవలసిన పెద్ద పనుల వెనుక కెవిపి ఉంటారన్నది జగమెరిగిన సత్యం. వైఎస్ మరణం తర్వాత జగన్ ను అంటిపెట్టుకున్న ఈయన జగన్ కు సిఎం పదవి రాదని తెలుసుకుని ఇప్పుడు వైఎస్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆయన జగన్ ను కలవడం బాగా తగ్గించారట. ఆయన ఎలక్షన్ కింగ్ కాకపోయినా కలెక్షన్ కింగ్ వాసికెక్కారు. రోశయ్యకు హైకమాండ్ కు మధ్య ఆయనే వారధి.












Click it and Unblock the Notifications