'మగధీర' నాదేనంటూ చారి మరో నోటీసు

సినిమాలో విడుదలైన సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న చారి ఆ సమయంలో రియాక్ట్ కాకపోవడం వల్ల "మగధీర విడుదల సునాయాశమైంది. గతంలో "బొమ్మరిల్లు" కథ మీద ఇటువంటి వివాదమే వచ్చ్చింది. కానీ బొమ్మరిల్లు కథ తనదేనని కోర్టుకెక్కిన ఒక డాక్టరుకు అనుకూలంగా కింది కోర్టులో తీర్పు వచ్చింది. ఆ డాక్టరు గారి కథకు "బొమ్మరిల్లు" సినిమాకు పెద్దగా పోలిక లేకపోయినా ఈ తీర్పు వచ్చింది.
"మగధీర" తెలుగులోనే ఇంత ఆడితే బాలీవుడ్ లో షోలే ను దాటి పోతుందన్న అంచనాలున్నాయి. అయినా నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సంబంధించిన బాలీవుడ్ ప్లాన్స్ ను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ తనను కథ విషయంలో మోసం చేశారని అల్లు అరవింద్ మనస్ధాపం చెందినట్టు సమాచారం. కథ ఎస్ పి చారి, స్క్రీన్ ప్లే విజయేంద్రప్రసాద్ అని వేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు అల్లు అరవింద్ అనుకుంటున్నట్టు సమాచారం. తెలుగులో వందకోట్లకు పైగా సంపాదించిన ఈ సినిమాను హిందీలో రీమేక చేస్తే వెయ్యికోట్లకు పైగా సంపాదించే అవకాశమున్నా అల్లు అరవింద్ ఇప్పుడు ముందుకు రాకపోవడానికి కారణం చారి లీగల్ నోటీసేనని తెలుస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో...












Click it and Unblock the Notifications