డిఎస్ తోక కత్తిరింపు

అభివృద్ధి, సంక్షేమమే ఉప ఎన్నికల్లో తమ ఎజెండా అని రోశయ్య చెప్పారు. తెలంగాణ నినాదాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని విజయం సాధించాలని డిఎస్ చేసిన ప్రయత్నానికి ఈ రకంగా కళ్లెం పడినట్లేనని చెప్పవచ్చు. డిఎస్ వల్ల తన పదవికి ప్రమాదం లేదని కూడా ఆయన చాలా తేలికగా మాట్లాడారు. 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, తానే తెలంగాణ సాధిస్తానని, తానే తొట్టతొలి తెలంగాణవాదిని అని డిఎస్ ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. ఆ ప్రగల్భాలకు ఇక తావు లేని నిర్ణయాన్ని పార్టీ హైకమాడ్ తీసుకున్నట్లు రోశయ్య మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications