నిమ్స్ ఆస్పత్రిలో సత్యం రాజు డీల్స్!

ఆయనను కలిసిన వారిలో కొందరు అడ్వకేట్లు ఉన్నా మిగితా వారంతా కోటీశ్వరులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులని సిబిఐ అధికారులు ఒక జాబితాను న్యాయస్ధానానికి అందజేశారు. అంతమందితో అన్ని గంటల సేపు మాట్లాడుతున్న రామలింగరాజు ఆరోగ్యంగా ఉన్నట్టేనని, ఆయనను జైలుకు తరలించాలని వారు అభ్యర్ధించారు. పలుకుబడితో, ధనబలంతో రామలింగరాజు కేసును బలహీనం చేయడానికి ప్రయత్నించవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. నిమ్స్ లో రాజును కలిసిన వ్యక్తుల జాబితాను చదివిన సీనియర్ సివిల్ జడ్జి బివిఎల్ ఎన్ చక్రవర్తి విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన చంచల్ గుడా జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
సత్యం రాజుపై అమెరికాలోనూ సీరియస్ సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అనారోగ్యం పేరు చెప్పుకుని ఆయన ఆ కేసుల విచారణను వాయిదా వేయించుకుంటూ వస్తున్నారు. అక్కడ ఆకేసులు రుజువైతే రామలింగరాజు మరణించే వరకు జైళ్లలోనే గడపవలసి ఉంటుంది. డబ్బుతో, రాజకీయ పలుకుబడితో ఆయన ఇంకెంత కాలం నిమ్స్ ఎసీ సూట్ లో గడుపుతారో చూడాలి.












Click it and Unblock the Notifications