రాజకుమారి వ్యవహారం!

ఆమె నోరు అంటే అందరికీ భయమే. చంద్రబాబు నాయుడు ఆమెను రాజ్యసభకు పంపకుండా, నేరుగా గెలిచే టికెట్ ఇవ్వకుండా చాలా కాలయాపన చేశారు. దిక్కుతోచని పరిస్ధితిలో ఆమె ఏ విషయాలు బయటపెడుతుందోనని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. బ్లాక్ మెయిల్ ద్వారా తెచ్చుకున్న పదవిలో ఎవరూ కూడా ఆనందంగా ఉండలేరు. రాజకుమారి లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెస్ నాయకులకు సన్నిహితం కావడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందరూ ఒకే కులం వారైనా ఎవరి గోల వారిది. చంద్రబాబు నాయుడు మహిళా నాయకులను వాడుకుని వదిలేస్తారన్నది ప్రధాన ఆరోపణ. జయప్రద, రోజాల గోల అదే. వాడుకోవడమంటే ప్రచారానికి మాత్రమే సుమా!
ఎవరు ఏమనుకున్నా రాజకుమారి ఫైర్ బ్రాండ్. ఆనాడు తనను రాజకీయాల్లోకి తెచ్చిన రామారావునే ఎదిరించి నాదెండ్ల భాస్కరరావుతో కలిసింది. ఆమె కాంగ్రెస్ లో ఉన్నంత వరకు వైఎస్ తో వైరమే. ఇద్దరూ ఒకే వయో వర్గానికి చెందిన వారు. ఇప్పుడు ఆమె చంద్రబాబు, ఇతర రాజకీయ నాయకుల బట్టలు విప్పి అసలు నిజాలు చెప్పడానికి సిద్ధమైతే అది ప్రజలకు మంచిదే. కానీ 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా స్వార్ధ ప్రయోజనాలు చూసుకుంటే అది సమాజానికి మంచిది కాదు.












Click it and Unblock the Notifications