జగన్ సొంత పార్టీ ఆలోచన?

YS Jagan
హైదరాబాద్: వైయస్ సెంటిమెంట్ తో వైయస్ జగన్ సొంత పార్టీ పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. వైయస్ సెంటిమెంట్ తో పాటు ధనబలం, సాక్షి మీడియా దన్ను ఉండడం జగన్ కు ప్లస్ పాయింట్లు. అనుభవరాహిత్యం ఒక్కటే ఆయనకు మైనస్ పాయింట్. కాంగ్రెసు హై కమాండ్ గనుక తన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకుంటే జగన మరింత తొందరగా సొంతపార్టీ పెట్టుకునే అవకాశముంది. తనను కాంగ్రెసు పార్టీ నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో సొంత పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచన వైయస్ కు వచ్చేది. ఆ విషయాన్ని తన అనుయాయులతో ఆయన చర్చించేవారు. ఇప్పుడు అటువంటి ఆలోచనలే జగన్ మనుషులకు వస్తున్నాయి.

వైయస్ హయాంలో కాంగ్రెసు ముద్రతో ప్రారంభమైన 'సాక్షి' పత్రిక ఇప్పటి కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రతిపక్షంలా మారింది. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ద్ధి పథకాలను రోశయ్య ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. గతంలో వైయస్ 'ఆ రెండు పత్రికలు' అంటూ మాటిమాటికి ఈనాడును, ఆంధ్రజ్యోతిని విమర్శించేవారు. అది సాక్షి పెట్టక ముందు సంగతి. సాక్షి వచ్చిన తర్వాత అది ప్రభుత్వ పత్రికగా అభివృద్ధి కార్యక్రమాల గురించి అనుకూలంగా రాస్తుండడంతో ఆ రెండు పత్రికలను పెద్దగా పట్టించుకోవలసి అవసరం ఆయనకు లేకుండా పోయింది. ఇప్పుడు రోశయ్య ప్రభుత్వంపై సాక్షిలో వస్తున్న ఘాటైన కథనాలు కాంగ్రెసు హైకమాండ్ కు కూడా అసహనం కలిగిస్తున్నాయి.

వరదసాయం గురించి హైకమాండ్ తో చర్చించడానికే ఢిల్లీ వచ్చానని రోశయ్య చెబుతున్నప్పటికీ ఆయన జగన్ వర్గంపై ఫిర్యాదుల చిట్టాతో సోనియాను కలవనున్నట్టు తెలిసింది. సొంతపార్టీ మనుషులే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. జగన్ వర్గానికి భయపడే ఆయన మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+