కేంద్ర వైద్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌పై బాలీవుడ్ ఐటం గర్ల్ సెలీనా జైట్లీ నిప్పులు చెరగడం వెనక పెద్ద కథే ఉందట. ఆమె బాయ్‌ఫ్రెండ్ గే అని అందుకే గే సంస్కృతిని వ్యతిరేకించిన ఆజాద్‌పై మండిపడుతోందని అంటున్నారు. స్వలింగ సంపర్కం వల్లనే ఎయిడ్స్ వస్తోందని ఆజాద్ ఓ ప్రకటన చేసి వివాదానికి కారణమయ్యారు. ఆజాద్ వ్యాఖ్యను ఖండిస్తూనే తనకు తాను భుజాలు తడుముకుంటోంది ఆ భామామణి. తాను మాత్రం గే కాదని, తనకు గేలంటే గౌరవభావం ఉందని ఆమె అంటోంది. నిప్పు లేకుండా పొగ రాదు కాదు కదా మరి.
గేలను గతంలో వెనకేసుకొచ్చిన చరిత్ర కూడా సెలీనాకు ఉంది. వారి తరఫున పోరాటం కూడా చేసింది. స్వలింగ సంపర్కుల స్వేచ్ఛ కోసం గొంతునిచ్చింది. ఆ తర్వాత మౌనం వహించి మళ్లీ తెర మీదికి వచ్చింది. ఆజాద్ ప్రకటనతో ఆమె మళ్లీ తెర మీదికి వచ్చి వార్తల్లోకి ఎక్కింది. ఆజాద్ వివాదం సెలీనాకు కలిసి వచ్చినట్లే ఉంది.