వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేశామా?: చిరు క్యాంపులో అంతర్మథనం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి తప్పు చేశామా? అనే అంతర్మథనం చిరంజీవి వర్గంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి బాహాటంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు చిరుకు గానీ, తమకు కానీ ఎక్కడా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. జగన్, తెలంగాణ సమస్యల కారణంగా తమను పక్కన పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారట. అవే సమస్యలతో ప్రభుత్వం సతమతమవుతున్న సమయంలో తాము ప్రభుత్వాన్ని ఆదుకున్నామని అయినప్పటికీ తమకు ప్రాధాన్యత ఇవ్వక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారట. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించిన దృష్ట్యా చిరంజీవికి సోనియా గాంధీ నుండి మరోసారి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఈసారైనా తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

పిఆర్పీని విలీనం చేశాక, పలు కీలక సమయాల్లో చిరుకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. వెళ్లినప్పుడల్లా తమకు అధిష్టానం నుండి హామీ వచ్చిందని చిరు చెప్పడం మించి ఆయన వర్గానికి జరిగిందేమీ లేదు. అయితే అవిశ్వాసం సమయంలో మాత్రం చిరు కూడా మంకు పట్టుపట్టడం, ముఖ్య నేతల నుండి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఫోన్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతోమరోసారి చిరువర్గంలో అసంతృప్తి చెలరేగకుండా ఉండేందుకు అధిష్టానం వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
It seems, Chiranjeevi camp in dilemma after no-confidence motion also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X