చిరంజీవికి అసెంబ్లీలో బ్యాక్ బెంచీయే

చిరంజీవి 18 శాసనసభా స్థానాలను గెలుచుకుని రెండో అతి పెద్ద ప్రతిపక్షంగా మొదటి బెంచీలో కూర్చుంటూ వస్తున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది కదా. ముందు వరుసలో కూర్చునే అవకాశం లేదా అని చిరంజీవి అమయాకంగా అడిగారని కూడా అంటున్నారు. అయితే, శాసనసభా పక్ష నేత స్పీకర్‌కు ఓ లేఖ ఇస్తే దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విలీనం జరిగినట్లు లేఖ ఇవ్వకపోతే మాత్రం మొదటి వరుసలో కూర్చోవచ్చు. చిరంజీవి లేఖ ఇవ్వకపోతే విలీనం పూర్తయినట్లు కాదు, శాసనసభలో కాంగ్రెసుకు కష్టాలు వస్తే కాపాడడం ఆపద్భంధవుడి చేతులో ఉండదు. విలీనం పూర్తయితే, కాంగ్రెసు జారీ చేసే విప్‌కు చిరంజీవికి చెందిన శాసనసభ్యులు కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి కోసం ఏం మార్గాలు వెతుకుతారో చూడాలి.












Click it and Unblock the Notifications