కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు కాళ్ల కిందికి రమేష్ నీళ్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కడప జిల్లాకు చెందిన సిఎం రమేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కాళ్ల కిందికి నీళ్లు తెస్తున్నారనే ప్రచారం ముమ్మరమైంది. తెలుగుదేశం వ్యవహారాలను పార్టీ కార్యాలయం నుంచి ఆయనే సమన్వయం చేస్తుంటారు. చంద్రబాబు ఎక్కువగా ఆయన మాటే వింటారట. దీంతో సిఎం రమేష్ చంద్రబాబుకు, ఇతర నాయకులకు మధ్య దూరం పెంచుతున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు రావడానికి సిఎం రమేష్ కారణమని అంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సిఎం రమేష్ శాసనసభ ఆవరణలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు నడిపారని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ తర్వాత కడప, పులివెందుల ఉప ఎన్నిక టికెట్ సీనియర్లను, పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని బిటెక్ రవికి రావడానికి తెర వెనక కథ నడిపింది కూడా సిఎం రమేషేనని అంటున్నారు. కడప లోకసభ సీటుకు తనకు అనుకూలంగా ఉండే పుత్తా నరసింహా రెడ్డిని తెర మీదికి తెచ్చింది కూడా ఆయనే అంటారు. బలహీనమైన అభ్యర్థులను దించడం ద్వారా కాంగ్రెసుకు అనుకూలంగా మారే వ్యూహాన్ని సిఎం రమేష్ రచించారని అంటారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పుత్తా నరసింహా రెడ్డిని పక్కన పెట్టి మైసురా రెడ్డిని లోకసభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారని అంటారు. ఏమైనా, సిఎం రమేష్ నమ్మినబంటుగా వ్యవహరిస్తూనే పార్టీకి చేయాల్సిన నష్టం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

English summary
It is learnt that CM Ramesh is playing main role to mould Telugudesam party president Chandrababu's decisions. It is said that CM Ramesh is acting to benefit Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X