చార్మి ప్రధాన పాత్ర పోషించిన సినిమా పైరసీ సిడీలు బయట పడ్డాయి. ఈ పైరసీ సిడిల వెనక ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు దాదాపు నాలుగు వేల దాకా పైరసీ సీడిలను పట్టుకున్నారు. వీటిలో మంగళ, అల్లరి నరేష్ నటించిన అహ నా పెళ్లంట సినిమాల పైరసీ సిడీలున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు ఓ ముఠాను అరెస్టు చేశారు. ఆ ముఠాలో ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగే మంగళ సినిమా పైరసీ సీడిలు బయటకు రావడం సినిమాకు పెద్ద దెబ్బనే అంటున్నారు. ఈ సినిమా సీడీలు ఓ ల్యాబ్ నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. తెలుగు సినిమాలకు పైరసీ బెడద సర్వసాధారణంగానే మారింది. అటు సినిమా విడుదల కాకముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి వస్తుండడంపై తెలుగు సినీ పరిశ్రమ చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Police nabbed a gang for marketing piracy CDs of Charmi's Mangala and Allari Naresh's Aha Na Pellanta in Cyberabad police commossionerate limits. It is said that a distributor is involved in Mangala piracy CDs.
Story first published: Saturday, March 5, 2011, 10:50 [IST]