హస్తం సాయం కోసం చంద్రబాబు?

Chandrababu Naidu
తన ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర స్థాయి సంస్థల విచారణ నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఇందుకు సంబంధించి ఆయన ప్రత్యర్థి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. తనపై విచారణలు జరగకుండా చూస్తే మైనారిటీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతానని ఆయన హామీ ఇచ్చినట్లు ఆ పత్రిక రాసింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, నాయకుడు సిఎం రమేష్ ఢిల్లీ కాంగ్రెసు పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు సాక్షి రాసింది.

చంద్రబాబుకు కాంగ్రెసు నుంచి ఓ మేరకు హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. తనపై హైకోర్టు విచారణలకు ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు బుధ, గురువారాల్లో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బుధవారం చర్చల్లో డీలా కనిపించిన చంద్రబాబు గురువారం సమావేశంలో కాస్తా హుషారు ప్రదర్శించారని, కాంగ్రెసు పెద్దల నుంచి ఒక రకమైన హామీ రావడమే అందుకు కారణమని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. కాంగ్రెసుతో వైయస్ జగన్ కుమ్మక్కై చంద్రబాబుపై కేసు వేశారని తెలుగుదేశం పార్టీ నిందిస్తున్న సమయంలో సాక్షి దినపత్రిక అదే ఆయుధాన్ని తిప్పికొడుతోందని భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+