సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి వివాహ వేదిక సెట్టింగ్‌ను మూడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేశారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. తూర్పు గోదావరి జిల్లా నుంచి 36 మంది వేద పండితులు, పురోహితులు వచ్చారు. మరింత మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు.
మండపేటకు చెందిన భగవాన్ మాస్టారు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. పెళ్లిలో వధూవరులు పట్టుకునే కొబ్బరి బొండాలను కూడా ప్రత్యేకంగా తెప్పించారు. మండపేటకు చెందిన కాజులురి వెంకటరెడ్డి వాటిని ప్రత్యేకంగా తయారు చేశారు. హైటెక్స్‌లో జరిగే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి 12 వేల మందికి పైగా అతిథులు వస్తారని అంచనా వేస్తున్నారు.