బొత్స సత్తిబాబుకు దర్శనమివ్వని అమ్మగారు

కె. కేశవరావు గానీ డి. శ్రీనివాస్ గానీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియా గాంధీతో సమావేశమయ్యేవారు. ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు మాత్రం పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సంయుక్తంగా సోనియాతో మాట్లాడేవారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణల విషయంలో మాత్రం ఆ సంప్రదాయం కనిపించడం లేదు. ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెసు అధిష్టానానికి చెందిన వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లను కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ విడివిడిగా కలిశారు. గురువారం మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అడుగు పెడితే శుక్రవారం మధ్యాహ్నం బొత్స సత్యనారాయణ ఆయనను ఐదు నిమిషాల పాటు కలిసి వెళ్లిపోయారు. దీన్ని బట్టి ఇరువురి మధ్య అగాధం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.
సోనియా గాంధీ కూడా బొత్స సత్యనారాయణను పూర్తిగా నమ్మడం లేదని అంటున్నారు. చిరంజీవిని పిలిపించుకుని మాట్లాడుతున్న సోనియా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న బొత్సను మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే, బొత్స సత్యనారాయణకు ఆంగ్లభాష సమస్య కూడా అందుకు కారణమని అంటున్నారు. ఇంగ్లీషులో మాట్లాడేవారికి ఉన్న యాక్సెస్ అది రానివారికి సోనియా వద్ద అంతగా ఉండదనే మాట కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications