ప్రచారం చేయించి...: సిఎంపై బొత్స వ్యూహం

ప్రధానంగా తెలంగాణలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెసుకు కష్టమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రితో ప్రచారం చేయించి వ్యతిరేక ఫలితాలు వస్తే అందుకు బాధ్యత అతని పైనే వేయాలనే వ్యూహంతో బొత్స వెళుతున్నారట. ముఖ్యమంత్రి వర్గం కూడా బొత్స వర్గం వ్యూహాలను దెబ్బకొట్టేందుకు స్కెచ్ వేస్తున్నదని అంటున్నారు. సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఆధిపత్య పోరు పార్టీకి మొదటికే మోసం చేసేలా ఉందని మరికొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీ సీనియర్లు మాత్రం నియోజకవర్గం గెలుపోటముల బాధ్యతను జిల్లా మంత్రులకే అప్పగించాలని సూచిస్తున్నారట.












Click it and Unblock the Notifications