వైయస్ జగన్ పార్టీలోకి సికె బాబు జంప్?

తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు పార్టీలకూ జంప్‌జిలానీల దెబ్బ తగులుతోంది. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి నేరుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించగా, చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు మాత్రం వైఎస్ వర్ధంతిని భారీఎత్తున నిర్వహిస్తూ పరోక్షంగా సూచనలిచ్చారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు టిడిపికి గుడ్‌బై కొట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు శనివారం ప్రకటించారు.
నక్కపల్లి పోర్టు సాధ న కోసం అని చెప్పి నియోజకవర్గ టిడిపి కార్యకర్తల స మావేశం ఏర్పాటుచేసిన చెంగల, సమావేశం చివరలో "జగన్‌ను కలిశా. ఎమ్మెల్యే టిక్కెట్టిస్తానని హామీ ఇచ్చా రు. ఆయనపై పూర్తి విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా.. మీ కోసం తలుపులు తెరచి ఉంచుతున్నా'' అని ప్రకటించారు. తక్షణం టీడీపీ సభ్వత్వానికి, రాష్ట్ర పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. వచ్చేనెల 15 తరువాత వైఎస్ విజయలక్ష్మి సమక్షంలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ తాను వైసీపీ నాయకుడినేనని, కొత్తగా ఆ పార్టీలో చేరేదేమిటన్నారు. ఈనెల 9న భువనగిరి సమీపంలోని రాయిగిరిలో జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన పెద్దపెద్ద నాయకులు వైసీపీలో చేరేందుకు లైన్‌లో ఉన్నారని ప్రకటించారు.












Click it and Unblock the Notifications