వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ జెఏసిలో 'వి'భిన్న స్వరాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిలో మరోసారి విభేదాలు పొడసూపుతున్నాయా అంటే కావొచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర పేరుతో తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పార్టీ ఐన బిజెపితోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని చెబుతున్నారు. ఐతే శనివారం జరిగిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖర రావు బిజెపి నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టినట్లుగా వార్తలు వచ్చాయి. తాను నిన్న, ఈ రోజు పత్రికల్లో చూశానని, టిఆర్ఎస్ వల్ల తెలంగాణ రాదని, బిజెపి వల్లనే వస్తుందని కిషన్ రెడ్డి అన్నట్లు వార్తలు వచ్చాయని, జెఏసిలో ఉన్నప్పుడు అందరం కలిసి పోరాడాలని, తెలంగాణ సాధన కోసం సమష్టిగా ముందుకెళ్లాలని, అంతేకాని టిఆర్ఎస్ వల్ల తెలంగాణ రాదని ఎలా చెబుతారని, జెఏసిలో ఉంటూ ఒకరిని మరొకరు విమర్శించుకుంటే ఎలా అని బిజెపి నేతలు సమాధానం చెప్పాలని అన్నారట.

గతంలోనూ జెఏసిలో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ ఒంటెత్తు పోకడలతో విసిగిన బిజెపి, సిపిఐ(న్యూడెమోక్రసి) జెఏసి నుండి బయటకు రావాలని కూడా భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విభేదాలను ఆ తర్వాత అన్ని పార్టీలు ఖండించాయి. తాజాగా మళ్లీ కేవలం బిజెపి వల్లనే తెలంగాణ సాధ్యమని కిషన్ రెడ్డి అనటం, ఆయన వ్యాఖ్యలపై కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అంతేకాకుండా శనివారం జరిగిన జెఏసి సమావేశంలో, కాంగ్రెసు, టిడిపిలను మనమెందుకు నిందించాలి, తెలంగాణ కోసం మన ఉద్యమం మన ఉద్యమం మనం చేసుకుంటూ పోతే సరిపోతుందని కదా అని ఓ జెఏసి నేత అభిప్రాయపడ్డారట. దానిపై కూడా కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ వ్యతిరేకులైన కాంగ్రెసు, టిడిపిలను రాజకీయంగా అంతం చేయకుండా రాష్ట్రం ఎలా సాధిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

English summary
TRS chief K Chandrasekhar Rao condemned BJP state president Kishan Reddy comments on TRs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X