వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ పార్టీ వైపు జీవన్ రెడ్డి?

సీమాంధ్ర ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ ప్రభంజనాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు. గత్యంతరం లేని స్థితిలోనే వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేశారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలనవుతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందే ఓ అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేస్తేనే తెలంగాణలో కాంగ్రెసుకు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. జీవన్ రెడ్డి చేరితే వైయస్సార్ కాంగ్రెసుకు కరీంనగర్ జిల్లాలో పెద్ద బలమే.