జగన్‌తో పట్టు తప్పకుండా కెసిఆర్ పావులు

K Chandrasekhar Rao-YS Jagan
తెలంగాణలో రోజు రోజుకు బలపడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 'రెడ్డి' వ్యూహంతో ముందుకు వెళుతున్నారని అంటున్నారు. సీమాంధ్రలో ఇప్పటికే బలపడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపై మరల్చారు.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన తన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మచే కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష చేయించారు. ఆ తర్వాత పలువురు నేతలకు గాలం వేశారని, ఇప్పటికే పలువురు చిక్కారని అంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వర రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన కెకె మహేందర్ రెడ్డి, నిజామాబాద్‌కు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా నుండి జలగం వెంకట్రావు తదితరులు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్ తెలంగాణలో నిలదొక్కుకునేందుకు అందర్నీ దరి చేర్చుకుంటున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గంపై ప్రధానంగా దృష్టి సారించారని అంటున్నారు. అయితే జగన్ వ్యూహానికి దెబ్బ కొట్టేందుకు కెసిఆర్ ఆయన సామాజిక వర్గాన్నే అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. సాధారణంగా రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం నిన్నటి వరకు కాంగ్రెసుకు జై కొట్టింది. తెలంగాణలో కూడా అదే విధంగా ఉండేది.

అయితే ఇప్పుడు జగన్‌ను తెలంగాణలో ఢీకొనేందుకు కెసిఆర్ రెడ్డి సామాజిక వర్గాన్ని తన దరి చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని తన పార్టీలోకి ఆహ్వానించారని, నాగం జనార్ధన్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకు వచ్చేందుకు కెసిఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంపై అసంతృప్తితో ఉన్న కెసిఆర్ ఆయనతో కూడా విభేదాలు మరిచి పని చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

కోదండరామ్ 'రెడ్డి' సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. జగన్ రాకతో తెలంగాణలో తన పట్టు తప్పకుండా ఉండేందుకు ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీలోకి భారీగా చేర్చుకొని, వారికి ప్రాధాన్యత ఇస్తేనే బావుంటుందనే ఉద్దేశ్యంతో ఆ దిశలో పావులు కదుపుతున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+