కష్టమైనా నో ఇంగ్లీష్: దోతీతో ఆకట్టుకున్న సిఎం

తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి ముందు కిరణ్ ఎపిఎస్ఆర్టీసి బస్టాండు ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లాల్చి పైజామాతో నిత్యం కనిపించి కిరణ్ తెలుగు మహాసభల నేపథ్యంలో సాంప్రదాయబద్దంగా ఉండాలని భావించారు. తెలుగుతల్లి విగ్రహం ఆవిష్కరణ సంబంధంగా ఆయన మాట్లాడేటప్పుడు తన ప్రసంగంలో ఇంగ్లీషు పదాలు దొర్లకుండా పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నాలు చేశారు.
తెలుగు తల్లి విగ్రహావిష్కరణ తర్వాత ఆయన అతను ప్రత్యేక పూజలు చేశారు. జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేశారు. తెలుగు తల్లి సెంటర్ వద్ద ఆయన మహా జన యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో రచయితలు, తెలుగు ప్రేమికులు... దాదాపు రెండు వేలకు పైగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications