కొండపల్లి సీతారామాయ్యను బాదితే...

తన భర్తను కొండపల్లి కోటేశ్వరమ్మ ఎక్కడా తిట్టలేదు గానీ తనకైతే తుపాకీ మడమ తిప్పి సీతారామయ్యను బాదితే బాగుండనిపించిందని ఆమె అన్నారు. ప్రజల కన్నా పార్టీ ఎక్కువ, మానవ సంబంధాల కన్నా పార్టీ కట్టుబాట్లే మిన్న అనే మగవాళ్ల సంకుచిత దోరణిని కోటేశ్వరమ్మ సునిశితంగా గమనించారని ఆమె అన్నారు.
ప్రజల చేతిలో కర్రలా, వడిసెలా ఉండాల్సిన వామపక్షాలు కాస్తా ఇప్పుడు అతి జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన గాజు పాత్రల్లా మిగిలిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. సమసమాజ స్వప్నం సాధ్యమని భావించే తన వంటి మహిళలమంతా ఒక వామపక్ష పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు కూడా ఆమె అన్నారు. కొటేశ్వరమ్మ నాయకత్వంలో పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందని, ఆమెతోనే పార్టీ నిర్మాణ ప్రతిపాదన చేద్దామని అనుకున్నానని మల్లు స్వరాజ్యం అన్నారు.
మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి నిజాం సైన్యాలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications