రాజకీయాల్లో రజనీకాంత్ వేలు పెడతారా?

Rajini Kanth
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వేలు పెడుతారనే ప్రచారం మరోసారి ముందుకు వచ్చింది. రజనీకాంత్ ఏది చేసినా అది వార్తే అవుతుంది. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి మరోసారి ఊహాగానాలు ముందుకు వచ్చాయి. అనారోగ్యం కారణంగా సినిమాలకు క్రమంగా ఆయన దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చుననే మాట వినిపిస్తోంది. అ ప్రచారానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బిజెపి నేతలు ఎల్‌కె అద్వానీ, నరేంద్ర మోడీ పాల్గొన్న సమావేశంలో ఆయన ప్రధాన ఆకర్షణగా మారారు.

గతంలో రజనీకాంత్ జయలలితకు వ్యతిరేకంగా ఉండేవారు. కానీ శానససభ ఎన్నికల ముందు నుంచే తన వైఖరి మార్చుకున్నారు. ఆయన జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకెకు ఓటేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏదో ఒక పార్టీలో చేరుతారా, సొంత పార్టీ పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన రాజకీయాల్లో వేలు పెట్టడం మాత్రం తప్పదనే వారు చాలా మందే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+