దూకుడు తంటా, రేణుకా చౌదరికి మొట్టికాయలు

రాష్ట్రపతి పదవిపై కాంగ్రెస్ అధిష్టానం ఇతర పార్టీల నాయకులతో చర్చలు సాగిస్తున్న తరుణంలో ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై గురువారం రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. "ప్రణబ్‌దా మా పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో అమూల్యమైన నేత. ఆయనను ప్రభుత్వం వదులుకోలేదు'' అని మీడియాతో భేటీలో ఆమె అన్నారు. రాష్ట్రపతి పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉన్న దీ లేనిదీ చెప్పలేనన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోనియా సమావేశం కానున్న సమయంలో రేణుకా చౌదరి ఆ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.
ప్రణబ్‌ను వదులుకోలేమని కాం గ్రెసే ప్రకటించింది కదా! అని మమత బెనర్జీ రేణుకా చౌదరి ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటా వ్యాఖ్యానించడం కాంగ్రెసు నాయకత్వం కోపానికి ఆజ్యం పోసింది. రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతుండగానే ఒక అధికారి ద్వారా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆమెకు కబురు పంపారు.
"అసలు మీరెవ రు ప్రణబ్‌ను వదులుకోలేమని చెప్పడానికి?'' అని మండిపడ్డారు. దీంతో కంగుతిన్న రేణుకా చౌదరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అలాగే నష్ట నివారణకు మరో అధికార ప్రతినిధి రషీద్ అల్వీ రంగంలో దిగారు. పార్లమెంటుకే కాకుండా దేశానికీ ప్రణబ్ సేవలు అవసరమేనన్నారు. తమ పార్టీలోనూ సుష్మా స్వరాజ్‌లున్నారని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి చెణుకు విసిరారు.












Click it and Unblock the Notifications