వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కోటలో వైయస్సార్ విగ్రహాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో షాక్ ఇచ్చేందుకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధపడుతోంది. చంద్రగిరి నియోజకవర్గంపై ఆ పార్టీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. చంద్రబాబునాయుడి సొంత గ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. తొలుత చంద్రబాబు ఆ గ్రామం నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారారు. అయినా, దానిపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గ్రామగ్రామాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ప్రతిష్టించేందుకు చంద్రగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. 150 గ్రామాల్లో 150 వైఎస్ విగ్రహాలు ప్రతిష్టించేందుకు భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు భాస్కర్ రెడ్డి బుధవారం వైయస్ విగ్రహాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకుని వచ్చి, పార్టీ ముఖ్య నాయకులందరికీ చూపించారు.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గతంలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఆ నియోజకవర్గం ప్రస్తుత మంత్రి గల్లా అరుణ కుమారి పాగా వేశారు. సినీ నటి రోజా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన ప్రాతనిధ్యం లేదని, దీనికి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌ను ఇంచార్జీగా నియమించాలని తెలుగుదేశం స్థానిక నాయకులు చెబుతూ వస్తున్నారు.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆ నియోజకవర్గంపై కన్నేసినట్లు కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఉనికి గానీ, గల్లా అరుణ కుమార్ ప్రాబల్యం గానీ పనిచేయకుండా వైయస్సార్ విగ్రహాలతో నియోజకవర్గాన్ని ముంచెత్తాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

English summary
YSR Congress party leader Chevireddy Bhaskar Reddy has prepared install YS Rajasekhar Reddy statues in Chandragiri assembly constituency. About 150 YSR statues are ready to install in Chandragiri constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X