వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూత్‌ను చూసి: జగన్‌పై బాబు మొబైల్ వార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కొత్త తరహా ఉద్యమానికి తెరలేపేందుకు తెలుగు తమ్ముళ్లకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 12వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలకు, యువతకు జగన్ అవినీతి పైన మొబైల్ వార్ చేయాలని పిలుపునిచ్చారు. వివేకానందుడి స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.

జగన్ అవినీతి గురించి ఒక్కొక్కరు పది వరకు ఎస్సెమ్మెస్‌లు చేయాలని సూచించారు. చంద్రబాబు తన పాదయాత్రలో జగన్, కాంగ్రెసు అవినీతి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అవినీతిలో తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు అని బాబు ధ్వజమెత్తుతున్నారు. జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాబు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మొబైల్ వార్‌కు తెరతీశారు.

పాదయాత్రలో బాబు ఆ రెండు పార్టీలపై నిప్పులు చెరిగుతున్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు ఒకే తానులో ముక్కలని ఆయన మండిపడుతున్నారు. అభివృద్ధి అంటే నై అవినీతి అంటే సై అనడమే ఈ పార్టీల సిద్ధాంతమని దుయ్యబడుతున్నారు. జగన్‌ను జైలులో కలుసుకుని ఆ పార్టీలో చేరుతున్నవారికి నీతిలేదని విమర్శిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో జగన్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపిస్తున్నారు.

నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు అమ్ముడు పోవడం లేదని, వారే పార్టీకి శక్తి అని ప్రశంసించారు. శనివారం ఆయన మాట్లాడుతుండగా.. కొంతమంది యువకులు మొబైల్‌లో మాట్లాడటం కనిపించింది. దీంతో బాబుకు కొత్త ప్లాన్ వచ్చింది. తమ్ముళ్లూ.. అందరి దగ్గరా సెల్‌ఫోన్లు ఉన్నాయి. వాటితో కూడా మీరు అవినీతిపై పోరాటం చేయొచ్చునని సూచించారు. జగన్‌కు వ్యతిరేకంగా ఒక్కొక్కరికి పది ఎస్సెమ్మెస్‌లు పెట్టండన్నారు. గతంలో జగన్ డబ్బుపై మూటలు, బండ్లు అంటూ లెక్కలు చేప్పిన విషయం తెలిసిందే.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu has called youth send sms against YSR Congress party cheif YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X