వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ రాజకీయంపై రాష్ట్ర విభజన పిడుగు

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-Moksha
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి సత్తా చాటాలనుకున్న నందమూరి హీరో బాలకృష్ణకు రాష్ట్ర విభజన పెద్ద ఆటంకంగా మారింది. కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించి సునాయసంగా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో కాలు పెట్టాలని ఆయన అనుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయన ఈ మధ్య కాలంలో పర్యటనలు చేయాల్సింది. కానీ విభజనతో సమైక్య సెగ రాజుకోవడంతో ఆయన పర్యటనలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన అటు కాలు వేసినా, నోరు మెదిపినా సమైక్య సెగ తగిలే ప్రమాదం ఉంది. దీంతో ఆయన మౌనంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు.

బాలయ్యకు ప్రస్తుతం సినిమాలు కూడా పెద్గగా ఏమీ లేవని అంటున్నారు. ఎన్నికల నాటికి కుమారుడ్ని హీరోగా పరిచయం చేసి పూర్తి సమయం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకుని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటున్న బాలకృష్ణకు విభజన ప్రకటన పెద్ద దెబ్బనే తీసిందని సమాచారం. విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

మరో వైపు, బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ పార్టీ రాజకీయాల్లో దెబ్బ తిన్నారు. టిడిపి లోక్‌సభ సభ్యులు నలుగురు రాజీనామా చేసినట్టు ప్రకటించి హడావుడి చేసినా, స్పీకర్ వద్దకు ఒకే ఒక రాజీనామా లేఖ వెళ్లింది. ఇక రాజ్యసభ సభ్యుల్లో హరికృష్ణ ఒక్కరిదే ఆమోదం పొందింది. టిడిపి ఎంపీల్లో ఒక్కరి లేఖ మాత్రమే వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం వెల్లడించడంతో టిడిపి ఎంపిలు ఇరకాటంలో పడ్డారు. రాజీనామా తర్వాత హరికృష్ణను పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

2009 ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు బాలకృష్ణ ఉత్సాహం చూపించారు. అయితే పోటీ చేసి ఒకే నియోజక వర్గానికి పరిమితం కావడం సరికాదని. పార్టీ విజయానికి రాష్టవ్య్రాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు కోరడంతో బాలకృష్ణ పోటీ చేయకుండా రాష్ట్రంలో పర్యటించారు. కాగా, విభజన అంశం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని, అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉండడమే బాలకృష్ణకు మంచిదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ మేరకు ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు భావిస్తున్నారు.

English summary
It is said that Tollywood hero and the Telugudesam party leader Nandamuri Balakrishna is maintaining strategical silence on his politics in the wake of bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X