లగడపాటి అప్పులపై సిబిఐ దర్యాప్తు?
హైదరాబాద్: తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సిబిఐ వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. లగడపాటి తీసుకున్న అప్పులపై తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కన్నేశారు. లగడపాటి రాజగోపాల్‌కు చెందిన 8 వేల కోట్ల రూపాయల రుణాల రీషెడ్యూల్‌పై చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు, సిబిఐకి ఫిర్యాదు చేయాలని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు.

రాజస్థాన్‌లోని సోలార్ పవర్ కుంభకోణంపై, లగడపాటి ఆస్తులపై విచారణ జరపాలని తాము సిబిఐని, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌ను కోరుతామని వారు మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజగోపాల్ కుటుంబానికి రాజస్థాన్ సోలార్ పవర్ కుంభకోణంలో పాత్ర ఉందని వారు ఆరోపించారు.
లగడపాటి అక్రమంగా సంపాదించిన డబ్బులతో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను ఆపుతామని సీమాంధ్ర నాయకులు అనుకోవడం మూర్ఖత్వమని వారన్నారు.
సిడబ్ల్యుసి, కేంద్ర మంత్రివర్గం, జివోఎం వద్ద సీమాంధ్ర నాయకులు పూర్తిగా విఫలమయ్యారని, వారు విభజనను ఆపలేరని కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు అన్నారు.












Click it and Unblock the Notifications