వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మక్బూల్ రిలీజ్: వైయస్ మిస్, రోశయ్య సంతకం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Dilsukhnagar bomb blasts: Maqbool released in Rosaiah's regime
హైదరాబాద్: హైదరాబాద్ పేలుళ్ల ఘటనలో అత్యంత కీలక పాత్ర పోషించాడని అనుమానిస్తున్న మక్బూల్ ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య ప్రభుత్వ హయాంలో జరిగింది. రెమిషన్‌తో కలుపుకొని పదేళ్ల శిక్షా కాలం పూర్తయిన 'మంచి ఖైదీల' జాబితాలో మఖ్బూల్, ఖాసీంబేగ్ కూడా చేరిపోయారు. 'సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వదిలేస్తున్నాం' అని 2009 ఆగస్టు 15న ముఖ్యమంత్రి వైయస్ అధికారికంగా ప్రకటించారు.

ఇక అప్పుడో, ఇప్పుడో ఫైలుపై సంతకం చేయాల్సి ఉండింది. ఇంతలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఈ ఫైలుపై సంతకం పెట్టారు. దాంతో 2009 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు మఖ్బూల్, ఖాసీం కూడా విడుదలయ్యారు.

మూడు హత్యలు, రెండు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న మక్బూల్ ఒక హత్యకేసులో చర్లపల్లి జైలులో యావజ్జీవ ఖైదీగా ఉన్నాడు. దాదాపు పదేళ్లపాటు ఇదే జైలులో గడిపాడు. మఖ్బూల్‌తోపాటు అతని స్నేహితుడు ఖాసీంబేగ్‌కు కూడా హత్యకేసులో శిక్ష పడింది. వీరిని మంజీర బ్యారక్‌లోని (అప్పట్లో పాపాగ్ని అని పిలిచేవారు) ఐఎస్ఐ ఉగ్రవాద విచారణ ఖైదీలతోపాటు సింగిల్ సెల్స్‌లో ఉంచారు.

భోజనం, వైద్యం, ములాఖత్ తదితరాల విషయంలో ఉగ్రవాద విచారణ ఖైదీలు తరచూ సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగేవారు. మఖ్బూల్, ఖాసీం మాత్రం ఇలాంటి వివాదాల జోలికి వెళ్లేవారు కారు. దీంతో వీరి 'సత్పవర్తన' అధికారులకు ఎంతగానో నచ్చింది. పైకి మంచిగా కనిపిస్తూనే మక్బూల్ ఉగ్రవాద విచారణ ఖైదీలను రెచ్చగొట్టేవారట..

English summary
Maqbool has been released in Rosaiah's regime. The file has been signed by Rosaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X