దూకుడు: సొంత గూటికి చిరు విధేయ మంత్రి?

Ganta Srinivas Rao
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు దూకుడుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై అందరి కన్నా ముందుండాలనే ఉద్దేశంతో దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్న గంటా శ్రీనివాస రావు వ్యూహం వెనక సొంత గూటికి చేరుకోవాలనే తపన ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవచ్చునని ప్రచారం సాగుతోంది.

తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ గంటా శ్రీనివాస రావు ఆ విషయంపై నోరు విప్పడం లేదు. పైగా, రాష్ట్ర విభజన జరిగితే తాను రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు గంటా శ్రీనివాస రావు ఆ పార్టీలో చేరారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా కాంగ్రెసు పార్టీలో కూడా ఓ వెలుగు వెలుగుతూ వస్తున్నారు. చిరంజీవి పట్టుబట్టి గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవి ఇప్పించారు. మంత్రి పదవిని ఆసరా చేసుకుని ఆయన ఉత్తరాంధ్రలో కీలకమైన నేతగా ముందుకు వచ్చారు.

కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. తానే సొంతంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయడానికి ఓ జెఎసిని ఏర్పాటు చేశారు. మొత్తం మీద, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి దూకడానికి నిర్ణయించుకోవడం వల్లనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+