తెలంగాణ సిఎం జానారెడ్డా, దామోదరనా?

K Jana Reddy and Damodara Rajanarsimha
హైదరాబాద్: పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లుగా ఉంది రాజకీయ నాయకుల పరిస్థితి. ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం తెలంగాణ నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ కచ్చితంగా ఏర్పడుతుందనే నమ్మకంతో వారున్నారు. అతి పెద్ద పార్టీగా కాంగ్రెసుకే తెలంగాణ ఏర్పడితే అధికారం దక్కే అవకాశాలున్నాయి.

నలుగురు ముఖ్య నేతలు ఎస్ జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి పోటీ పడుతున్నట్లు వినికిడి. వీరిలో జానా రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై మక్కువ పెంచుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ జైపాల్ రెడ్డికి అవకాశం వస్తే జానా రెడ్డి పక్కకు తప్పుకోవచ్చునని అంటున్నారు.

రాష్ట్ర విభజన విషయంలో చివరి నిమిషంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలకంగా మారారు. దళిత నేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తెలంగాణ కోసం ప్రయత్నాలు చేసిన ముఖ్య నేతల్లో ఒకరిగా తనకు అవకాశం వస్తుందని దామోదర రాజనర్సింహ నమ్ముతున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. అధిష్టానానికి అత్యంత విశ్వాస పాత్రుడైన డి. శ్రీనివాస్‌ పేరు పరిగణనలోకి రావచ్చునని అంటున్నారు. బిసి వర్గానికి చెందిన నేత కావడం డి. శ్రీనివాస్‌కు కలిసి వచ్చే విషయమని అంటున్నారు.

ఎస్ జైపాల్ రెడ్డిని ముందుకు తెస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన నాయకులు ఆయన పేరును వ్యతిరేకించబోరని, దానివల్ల అంతర్గత విభేదాలు పొడసూపవని అంటున్నారు. జానా రెడ్డిని ముందుకు తెస్తే దళిత, బిసీ నేతలు వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. జైపాల్ రెడ్డికి ఆ సమస్య ఉండదు. అదే సమయంలో జానారెడ్డి కూడా సర్దుకుపోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+