సీతయ్య: లోకేష్ దూకుడుకు జూ.ఎన్టీఆర్ బ్రేక్

Nara Lokesh - Jr Ntr
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి బ్రేక్ పడిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై ఇటీవల జోరుగా చర్చలు సాగిన విషయం తెలిసిందే. తాను ఏప్రిల్, మే నెలల్లో పూర్తిస్థాయిలో రాజకీయ ఆరంగేట్రం చేస్తానని, తన భార్య బ్రాహ్మణికి హెరిటేజ్ బాధ్యతలు అప్పగిస్తానని మూడు నెలల క్రితం ఓ సందర్భంలో లోకేష్ చెప్పారు.

అనుకున్నట్లుగానే అప్పటి నుండి అతను పలు నియోజకవర్గాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పని చేశాడు. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను, కార్యకర్తలను కలిసి పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశాలు జోరుగా జరిపారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల్లో ఒకటికి రెండుసార్లు పర్యటించారు. దీంతో అతని రాజకీయ ఆరంగేట్రం జరిగిందని, కేవలం ప్రకటన మాత్రమే మిగిలిందని అందరూ భావించారు.

ఇటీవల హెరిటేజ్‌లో బ్రాహ్మణి డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన ఏ క్షణంలోనైనా వస్తుందని అందరూ భావించారు. విశాఖపట్నంలో చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఆరంగేట్ర ప్రకటన ఉండవచ్చునని పలువురు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. అనూహ్యంగా లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది.

లోకేష్ ఎందుకు తగ్గారు?

ఇప్పటికే తెలుగుదేశం రెండుసార్లు అధికారానికి దూరంగా ఉంది. ప్రాంతీయ పార్టీ అయిన టిడిపి మూడోసారి అధికారంలోకి రాకుంటే పార్టీ నిలదొక్కుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో కుటుంబ విభేదాలు పార్టీకి నష్టాన్ని చేకూరుస్తాయనే ఆందోళన వారిలో ప్రారంభమైందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణల భయం వల్లే బ్రేక్ పడిందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో సీతయ్యలాంటి హరికృష్ణ దేనికైనా సిద్ధపడతారని, ఎన్నికల ముందు ఇలాంటి జంఝాటాలు వద్దనే అభిప్రాయానికి బాబు వచ్చినట్లుగా తెలుస్తోంది.

పాదయాత్రతో టిడిపిలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇలాంటి సమయంలో లోకేష్ రాజకీయ ఆరంగేట్ర ప్రకటన చేయించి నారా - నందమూరి కుటుంబాల్లో విభేదాలు మరింత బహిర్గతపర్చి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దనే ఉద్దేశ్యంతోనే లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి బ్రేక్ పడి ఉంటుందని అంటున్నారు. గతంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి త్వరలో వస్తానని చెప్పిన లోకేష్ ఇప్పుడు సరైన సమయంలో వస్తానని చెబుతున్నారని అంటున్నారు.

ఆలస్యంగానైనా...

జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు లోకేష్ రాజకీయ ఆరంగేట్రం విషయమై చంద్రబాబు, బాలకృష్ణలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బాబు పాదయాత్ర ప్రారంభంలో అన్నీ తానై నిర్వహించిన హరికృష్ణ ముగింపు సభకు రాలేదు. దీంతో తెగతెంపులు జరిగినట్లుగానే అందరూ భావించారు. అయితే, ఆలస్యంగానైనా చంద్రబాబు, లోకేష్‌లు నష్టాన్ని పూడ్చుకునేందుకు ముందుకు వచ్చారని అంటున్నారు. అందుకే లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి బ్రేక్ పడిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+