వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: కిరణ్ రెడ్డి 'అమ్మ' భక్తుడే, మౌనమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Reddy is loyal to Sonia Gandhi
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మభక్తుడేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అంటే, బయటకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కిరణ్ కుమార్ రెడ్డి విధేయుడిగానే వ్యవహరిస్తారని ఆయన చెప్పదలుచుకున్న విషయమని అర్థమవుతోంది.

కాగా, అన్ని విషయాలపైనా ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా మౌనంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీ పెడతారనే పుకార్లపై ఆయన అవునని గానీ కాదని గానీ సమాధానం చెప్పడం లేదు. మంగళవారం తనను కలిసిన కొంత మంది కలిసినప్పుడు అడిగితే ఆయన ఏమీ మాట్లాడలేదట.

వచ్చే ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కాంగ్రెసు అధిష్టానం తనకు నిర్దేశించిందని, లేనిపక్షంలో ఎప్పుడో మార్చి ఉండేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారట. మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, కె. సత్యనారాయణ రాజు, మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ తదితరులు ఆయనను మంగళవారంనాడు కలిశారు. తమ రాజకీయ భవిష్యత్తుపై తాము ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామని, ఇందుకు సంబంధించి మార్గదర్శకత్వం వహించాలని వారు కిరణ్ కుమార్ రెడ్డితో అన్నట్లు తెలుస్తోంది.

మీరు రాజకీయ పార్టీ పెడితే, తాము తమ నిర్ణయం తీసుకుంటామని అని జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రితో అన్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి నేరుగా సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. తనను కొంత మంది అధిష్టానం కోవర్టునని, తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని మరి కొందరు, తాను సర్వేలు నిర్వహిస్తున్నానని తాజా కొంత మంది అంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి వారితో అన్నారట. అంతేగానీ, ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు.

English summary

 Amid the thick rumours that he would start a political party, Chief Minister N. Kiran Kumar Reddy remained silent on the subject when quizzed by his confidants on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X