కార్ లోన్ మొత్తం తీర్చేశారా? ఈ 4 పనులు చేయకపోతే మీ కార్ అమ్మడం కష్టమే!

తమ జీవితంలో ఓ కారు కొనుక్కోవడం అనేది చాలా మందికి చిరకాల కోరిక. దాని కోసం లోన్ తీసుకుని మరీ కారు కొనుక్కుంటారు. అనంతరం ఆ లోన్ తీర్చడానికి నానా కష్టాలు పడుతుంటారు. ఎలాగోలా కష్టపడి లోన్ మొత్తం కట్టేస్తారు. కానీ చాలా మంది కారు లోన్ మొత్తం కట్టేసిన అనంతరం లోన్ పని పూర్తయిపోయిందని.. ఇక కారు తమదేనని అనుకుంటారు. కానీ రూల్స్ ప్రకారం.. లోన్ తీరిపోగానే సరిపోదు. మీ ఆర్సీ(RC)లో నుంచి బ్యాంక్ పేరును తొలగించే 'హైపోథికేషన్ టర్మినేషన్' ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఒకవేళ ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే భవిష్యత్తులో మీ కారును మీరు అమ్ముకోలేరు. అయితే కారు లోన్ పూర్తిగా కట్టేసిన తర్వాత తప్పనిసరిగా పాటించాలని 4 ముఖ్యమైన స్టెప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1, బ్యాంక్ నుంచి అవసరమైన పత్రాలను పొందాలి.
లోన్ చివరి ఈఎంఐ చెల్లించిన మీ సంబంధిత బ్యాంక్ నుంచి ఈ పత్రాలను తప్పకుండా తీసుకోవాలి. బ్యాంకు నుంచి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే పత్రం(నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్-NOC) ఖచ్చితంగా తీసుకోవాలి. లోన్ పూర్తిగా కట్టేసినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆర్సీ(RC)లో నుంచి బ్యాంక్ హైపోథికేషన్‌ను తొలగించడానికి అవసరమైన ఫారమ్ 35ని తీసుకోవాలి. మీ ఒరిజినల్ ఆర్సీ కార్డును ఖచ్చితంగా తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ఈ పత్రాలన్నింటినీ 3 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకుని భద్రపరచుకోవాలి.

Finished Car Loan EMI How to remove Bank hypothecation Complete These 4 Steps Before Selling Your Vehicle

2. పరివాహన్ పోర్టల్‌లో ఆన్ లైన్ అప్లికేషన్
లోన్ నడుస్తున్నంత కాలం మీ ఆర్సీపై బ్యాంక్ పేరు మీద 'హైపోథికేషన్' నమోదై ఉంటుంది. ఒకవేళ లోన్ కట్టకపోతే బ్యాంక్‌కు కారును స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. లోన్ తీరిపోయినా ఆర్సీలో బ్యాంక్ పేరు అలానే ఉండిపోతుంది కాబట్టి దానిని తొలగించేందుకు భారత ప్రభుత్వ పరివాహన్ సేవా పోర్టల్‌లోకి వెళ్లాలి. 'హైపోథికేషన్ టర్మినేషన్' ఎంపికను ఎంచుకుని అప్లై చేయాలి. నిర్ణీత రుసుము చెల్లించి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

3. రాష్ట్ర రవాణా పోర్టల్ ద్వారా ఆర్సీ అప్‌డేట్ చేసుకోవాలి..
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోని వాహనదారుల కోసం ఈ ప్రక్రియ చాలా సులభతరం చేయబడింది. ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ వాసులు టీజీ ఆర్టీవో పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాసులు ఏపీ ఆర్టీవో పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి రుసుము చెల్లిస్తే ఆన్‌లైన్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. 20 నుంచి 30 రోజుల్లో మీ కొత్త అప్‌డేటెడ్ ఆర్సీ కార్డు మీ ఇంటి చిరునామాకు పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది.

4. ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి
మీకు వచ్చిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కాపీని కారు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్సూరెన్స్ రికార్డుల్లో కూడా బ్యాంక్ పేరు తొలగించబడి కారుపై పూర్తి యాజమాన్య హక్కులు మీ పేరు మీదికి మారతాయి.

ఈ ప్రక్రియ అంతా పూర్తయిన అనంతరం పరివాహన్ యాప్ లో మీ ఆర్సీ స్టేటస్ చెక్ చేసుకుని బ్యాంక్ పేరు తొలగించబడిందో లేదో సరిచూసుకోండి. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం మీ కారును అమ్ముకోవడానికి వీలు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+